ముంబయిలో వ్యభిచారం కొత్త పుంతలు

Date:06/01/2020

ముంబై ముచ్చట్లు:

ముంబయిలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సెక్స్ రాకెట్‌ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా దాడులు చేసి పట్టుకుంటున్నా నిర్వాహకులు ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా శనివారం ముంబయిలోని జుహు ప్రాంతంలో గల ఓ లగ్జరీ హోటల్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు.జుహు బీచ్‌లోని సన్ ఎన్ సాండ్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరందనరినీ యాక్టింగ్, మోడలింగ్ పేరుతో ముంబయికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రైడింగ్‌లో పట్టుబడిన యువతులు పలు హిందీ ఛానల్స్‌లోని సీరియల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో నటిస్తున్నారని జుహు పోలీస్‌స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ పంధారినాథ్ వావల్ తెలిపారు.హోటల్‌లో ఐదుగురు వ్యక్తులు రెండు రూమ్‌లను బుక్ చేసినట్లు గుర్తించిన పోలీసులు పక్క సమాచారంతో అక్కడ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు బ్రోకర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే తమ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు తమకు తెలీదని సిబ్బంది చెబుతున్నారు.

 

ఏపీలో రాజధానిపై గందరగోళం

 

Tags:Prostitution in Mumbai is new

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *