నంద్యాల పట్టణ ప్రజలను దోమల నుంచి కాపాడండి,సీపీఎం డిమాండ్

నంద్యాల  ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలోని ప్రజలను దోమల బారి నుండి కాపాడేందుకు పట్టణంలోని 42 వార్డుల్లో ప్రతి వీధిలో ఫాగింగ్ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి తోట.మద్దులు, నాయకులు లక్ష్మణ్, శివ, అవుకు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం మొదలవుతున్న సందర్భంలో పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఖాళీ స్థలాలలో నీరు పేరుకొని పోవటం వలన వాటినుండి ఇళ్లలోకి చొరబడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ ఖాళీ స్థలాలను ప్రభుత్వమే ఆక్రమిస్తుంది అని పలుమార్లు చెప్పారని కానీ  చర్యలు తీసుకోవడం లేదని కూడా ఎలాంటి చర్యలు  చేపట్టకపోవడంతో యధేచ్చగా స్థల యాజమానులు వదిలేశారని అన్నారు. గత మున్సిపల్ బడ్జెట్లో 25 లక్షలకు పైగా ఫాగింగ్,బ్లీచింగ్ పౌడర్ కోసం కేటాయించడం జరిగిందని వాటిని పట్టణంలో ఏ మేరకు ఖర్చు చేశారో తెలపాలని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ తీసుకుని పట్టణంలోని ప్రతి వీధిలో, 42 వార్డుల్లో దోమల బెడద తగ్గించేందుకు తగిన చేపట్టాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ గా ఆందోళనలు చేపడతామని అన్నారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాలలో ప్రస్తావన తీసుకు వచ్చినా కమిషనర్ గానీ, అధికారులు గానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Protect Nandyal town people from mosquitoes, CPM demands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *