దుర్గందాల నుండి ప్రజలను కాపాడండి

కడప ముచ్చట్లు:

మనిషి ఆయుష్కాలం 60 లేదా 70 సంవత్సరాలు, సరోజినీ నగర్, రాజీవ్ గృహకల్ప, టిక్కొ ఇల్ల, పరిసరాల ప్రాంతంలో జీవించే ప్రజలకు మాత్రం 45, 50 సం  బ్రతుకుట మహా కష్టమని, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు,తస్లిమ్, లక్ష్మి దేవి లు  అభిప్రాయపడ్డారు. బుధవారం టిక్కొ ఇళ్లను పరిశీలించడానికి వెళ్లిన వారికి, ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం వెదజల్లుతూ ఉన్నాయని, ఈ పరిసరాల్లో ఉన్న వారు క్యాన్సర్  జయించడం అతియో శక్తేనని వారన్నారు,చుట్టుప్రక్కల ఫ్యాక్టరీలు అధికంగా ఉండటం చేత, వాటి నుండి వెలువడే వెర్దాలు, రోడ్లపైన ప్రవహిస్తున్నాయని, నడవడానికి సాధ్యం కాని రీతిలో ,(పెద్ద పెద్ద గుంతలలోవాహనాలు సైతం సర్కస్ లలో బండ్లు తోలే వారు మాత్రమే తొలగలరు) ఆ వ్యర్థాల మురుగు పారుతుందని, వెర్దాలు  రోడ్లపై మనుషులకు ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, కెనాల్ ద్వారా ఊరి బయటకు మళ్ళించాలని వారు కోరారు. రాజీవ్ గృహకల్ప, టిక్కొ గృహాలలో ప్రజలు నివాసం ఉండటానికి ముందుకు రాకపోవడనికి గల కారణం,  అసౌకర్యంగా ఉండటం, భరించలేని దుర్వాసన తోనే ప్రజలు వాటేకు దూరంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాలలో పర్యటించి, సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో చిన్నోడు పాల్గొన్నారు.

 

Tags:Protect people from bad smells

Leave A Reply

Your email address will not be published.