రాజ్యాంగం ప్రసాదించి హక్కులను కాపాడాలి

Protect the rights of the constitution

Protect the rights of the constitution

– అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రమణారెడ్డి

Date:26/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో నివసించే పౌరులందరికి రాజ్యంగం అంధించిన హక్కులు ఉల్లంఘన జరగకుండ ప్రతి ఒక్కరు కాపాడాలని పుంగనూరు అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రమణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కోర్టు ఆవరణంలో రాజ్యాంగ దినోత్సవం, లా డేను తహశీల్ధార్‌ మాదవరాజు, న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెప్ప, మల్లికార్జునరెడ్డితో కలసి ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు న్యాయవాదులతో కలసి న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమణారెడ్డి న్యాయవాదుల చేత హక్కులను కాపాడుతామని ,వృత్తి ధర్మాన్ని కాపాడుతామని ,న్యాయం కోసం కృషి చేస్తామని, సమస్యలు లేని నవసమాజాన్ని నిర్మించేందుకు రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామంటు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమణారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు తమ వద్దకు వచ్చే కక్షిదారులకు సత్వరన్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలను జఠిలం చేయకుండ సామరస్యధోరణిలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పని చేసి అందుకు తగ్గ ప్రతిఫలం పొందితే బాగుంటుందన్నారు. కాని ప్రస్తుతం సమాజంలో విలువలు పడిపోతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. అలాగే మనకు కన్పించే విషయాలు న్యాయం అని తెలిస్తే వాటి కోసం వృత్తిధర్మాన్ని ప్రక్కన పెట్టి, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే మండలంలోని ఏటవాకిలో గ్రామంలో సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్‌ ఎంపిపి రామచంద్రారెడ్డి, న్యాయవాదులు వెంకట్రమణ, శ్రీనివాసమూర్తి, వై.భాస్కర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, బాలాజికుమార్‌, శివశంకర్‌నాయుడు, ఎలినార్‌ ప్రశాంతి, వినోద్‌కుమార్‌, హరినాథరెడ్డి, ఆనందకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

 స్వైన్ సైరన్ 

Tags: Protect the rights of the constitution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *