Protected fresh water supply to rural people

గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షి త మంచినీటి సరఫరా

– పెద్దిరెడ్డి

Date:23/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికి రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఈడిగపల్లె గ్రామ నివాసి కృష్ణమూర్తి సుమారు రూ.5 లక్షలతో రక్షిత మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి పెద్దిరెడ్డితో పాటు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ అతిధులుగా హాజరైయ్యారు. పెద్దిరెడ్డి, భాస్కర్‌రెడ్డి కేంద్రాన్ని ప్రారంభించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోను మినరల్‌ వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచినీటి సమస్య లేకుండ చేసేందుకు గడికోట రిజర్వాయర్‌ నుంచి కూడ ఇంటింటికి కొళాయిల ద్వారా నీటి సరఫరా చేసేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రణాళికలు సిద్దం చేశారని తెలిపారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరులో 15 సంవత్సరాలుగా లేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే పుంగనూరును ఆదర్శవంత మైన నియోజకవర్గంగా ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌ మజ్ధూర్‌ ఆర్టీసి అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, స్థానిక నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మునిరత్నం, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వివిధ అలంకారాలలో అమ్మవార్లు

Tags: Protected fresh water supply to rural people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *