Natyam ad

పుంగనూరులో మసీదుల గురించి నిరసన

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో ఎస్‌డిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం జ్ఞానవాపి, జన్నత్‌వాలీ మసీదు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ కార్యదర్శి అతిక్‌బాషా మాట్లాడుతూ 1947 చట్టాల మేరకు ప్రార్థన మందిరాలు స్వరూపం ఏవిధంగా ఉన్నదో అదేవిధంగా కొనసాగించాలని చట్టంనిర్ధేశిస్తోందన్నారు. కానీ విరుద్దంగా ఢిల్లీలో 600 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన జన్నత్‌వాలీ మసీదును కూల్చివేయడం అప్రజాస్వామ్యమన్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు యూసుఫ్‌, సిద్దిక్‌, షాముభారక్‌, చాంద్‌బాషా, మహబూబ్‌బాషా , ఆసిఫ్‌, నజీర్‌, ముస్తఫ, రిజ్వాన్‌, ఇర్షాద్‌అలి, జావీద్‌, హుజెఫా, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Protest about mosques in Punganur

Post Midle