అగ్ని పథ్ కు వ్యతిరేకంగా నిరసన
విశాఖపట్నం ముచ్చట్లు:
దేశ భద్రతకు నష్టం కలిగించేలా అగ్ని పధ్ స్కీం ఉందని ఆరోపిస్తున్న ప్రజా సంఘాలు దీన్ని పూర్తిగా రద్దు చేయా లని డిమాండ్ చేశాయి.దేశ రక్షణలో యువత కీలకపా త్ర అంటూ ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించాయి. రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగు పాలచాలని కోరుతూ విశాఖ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. డివైఎఫ్ఐ, ఎస్ఎ ఫ్ఐ, సిఐటి యు ఆధ్వర్యంలో మద్ది లపాలెం లోని సిఐటియు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరిం చడంతో ప్రజా సంఘాలు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తప్పనిసరి పరిస్థితులలో ప్రజా సం ఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి కుమార్ మాట్లాడు తూ ప్రధాని మోడీ అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే సైన్యం లో కూడా ప్రైవేట్ భాగస్వా మ్యం చేయాలని చూస్తు న్నారని ఆరోపించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం పోటీ పడుతున్న యువకుల ఆశలపై నీళ్లు చల్లారని మండి పడ్డారు. దేశ భద్రతకు నష్టం కలిగించే అగ్నిపత్ స్కీం ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Tags: Protest against Agni Path

