హోదాకోసం పడవల నిరసన

Date:17/04/2018
కాకినాడ ముచ్చట్లు:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొత్తరకం అందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి,ఏపీ తో చేలగాటం,  మోడి కి ఇరకాటం అంటూ దాదాపు వంద  బోట్లు లో నీరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణ సమయం లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ యమున నది నీరు,  పవిత్ర మట్టిని తీసుకుని ఇచ్చారు.అప్పుడు ఏపీ ని అన్ని విధాలుగా ఆడుకుంటూం,  తోడు ఉంటాం అని చెప్పారు. తరువాత ఏ విధంగా ఆదుకున్న చర్యలు లేదు.  అంతే కాకుండా రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. మరోవైపు, పలు కేసుల్లో ముద్దాయిలు గా  వున్నల వైకాపా నేత,ఎంపీ  విజయసాయి రెడ్డి ప్రధానిని కలవడం.దేనికి నిదర్శనమని అయన ప్రశ్నించారు. రా: ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిన నరేంద్ర మోడీ మాకు ఇచ్చిన మట్టి నీరు ఇక్కడ సముద్రం లో కలిపేస్తున్నామని అన్నారు. రాబోయే రోజులలో మీ పార్టీ పరిస్థితి కూడ ఇలాగే ఉంటుందని హెచ్చరించారు.
Tags: Protest against boat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *