చెత్త పన్నులకు వ్యతిరేకంగా నిరసన

చీరాల ముచ్చట్లు:

 

 

ప్రకాశం జిల్లా చీరాల మునిసిపల్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంఘాల ఆధ్వర్యంలో పెంచిన ఆస్తి విలువ ఆధారిత పన్నులు,యూజర్ చార్జీలు,  చెత్తపై చెత్తపన్నులను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ,కరోనా కష్టసమయంలో ఆస్తి విలువ ఆధారిత పన్నులు,చెత్తపై చెత్తపన్నులు పెంచి ప్రజలపై పెనుభారాన్ని విధించడం మంచిపద్దతి కాదని 196,197,198 ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని అందులో భాగంగా ముప్పై మూడు మంది వార్డ్ కౌన్సిల్లర్లు అందరూ కూడా సహకరించాలని లేనిపక్షంలో ఆందోళనా కార్యక్రమాలు  మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Protest against garbage taxes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *