Natyam ad

ఓయూ లో నిరసన

హైదరాబాద్ ముచ్చట్లు:

టీఎస్ పి ఎస్ సి చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. టీఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ పై ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారణ ప్రవీణ్ ను అరెస్టు చేసి అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు, ప్రవీణ్ విచారిస్తే ఆయన వెనుక ఉన్న టిఆర్ఎస్ నేతలు బయటకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. పేపర్ లీకేజీ పై చైర్మన్ జనార్దన్ రెడ్డి  బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Post Midle

Tags; Protest in OU

Post Midle