Natyam ad

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కాన్వాయ్ ను పంజాబ్ లో నిర‌స‌న‌కారులు

పంజాబ్ ముచ్చట్లు:
 
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కాన్వాయ్ ను పంజాబ్ లో నిర‌స‌న‌కారులు ఏకంగా 15 నుంచి 20 నిమిషాలు అడ్డుకున్నారు. దీంతో దేశం మొత్తం మీద బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారివారి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున మౌన దీక్ష నిర్వహించారు.ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ కోలామరియు బిజెపి నాయకులు కార్యకర్తలు. మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ కోలా మాట్లాడుతూ… దేశ అభివృద్ధికై ప్రధానమంత్రివర్యులు నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయోజనాత్మకమైన పథకాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పంజాబ్ ప్రధానమంత్రివర్యులు నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీజీకి పూలమాలలు వేసి దేశంలో ఇప్పటికే కనుమరుగైపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధి కలిగించమని వారు మహాత్మాగాంధీమహాత్ముని వేడుకున్నామని తెలియజేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Protesters march on Prime Minister Narendra Modi’s convoy in Punjab