ఇళ్లు ఆలస్యంపై నిరసన దీక్షలు

Date:30/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని లబ్దీదారులు అరోపిస్తున్నారు.  భవన నిర్మాణాలు ఆలస్యం జరుగుతుండటంతో వారంతా నిరాహారదీక్ష చేపట్టారు.  మలక్ పేట నియోజక వర్గం చావణీ డివిజన్ పిల్లిగుడిసెల ప్రాంతంలో 2015 డిసెంబర్ లో స్వయంగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ ఇళ్ల పథ కానికి శంకుస్థాపన చేశారు. కానీ పనుల మాత్రం 2017 మే నెలలో మొదలయ్యాయి. మూడేళ్లయినా ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు. 324 ఇళ్ల నిర్మాణం,   పిల్లి గుడిసెల ప్రాంతంలో 150 మంది లబ్దిదారులను గుర్తించినట్లు సైదాబాద్ మండల రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.  ఏడాది కాలంలోల్ నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు ఆందజేమని చెప్పారు. ఐదేళ్లు గడిచినా ఇళ్లు ఇవ్వలేదు. దాదాపు 150 మంది లబ్ధిదారులు బయట నెలకు రూ.5వేల నుంచి రూ.8వేలు అద్దెలు చెల్లిస్తున్నారు.  ఇళ్ల కేటాయింపు పై అధికారులు లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించాబోమని  భాధితులు తెలిపారు.

మంత్రి అవంతితో హోం మంత్రి భేటీ

Tags: Protests against house delays

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *