Protests by Muslims continued on the sixteenth day

పదహారవ రోజు కొనసాగిన ముస్లింల నిరసన దీక్షలు

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముస్లింలు 16వ రోజు రిలే దీక్షలు నిర్వహించారు. పట్టణంలోని నక్కబండకు చెందిన అమీన్‌ మసీదు ముతవల్లి ఖాజా ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులలో పౌరసత్వ సవరణ చట్టం వద్దు… ఎన్‌ఆర్‌సీ, సీఐఏ, ఎన్‌ఆర్‌పీ రద్దుపరచండి….కొత్తచట్టాలను బహిష్కరిస్తాం…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు రక్షణ కరువైందని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు తాముగా పోరాటం చేస్తున్నామని , ఈ పోరాటంలో ముస్లింలకు ప్రతి ఒక్కరు సంఘీబావం ప్రకటించాలని కోరారు.

జాతీయజెండ పట్టుకుని మానవహారం

Tags: Protests by Muslims continued on the sixteenth day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *