ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం     మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గం:వెంకయ్య

న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు, అమెరికా నుంచి లఢక్‌ వరకు ప్రతిఒక్కరు ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని టైమ్స్‌ స్వ్కేర్‌లో జరిగిన కార్యక్రమంలో మూడు వేలమందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, న్యూయార్క్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లఢక్‌లోని పాంగాంగ్‌ టీఎస్‌ఓ సరస్సు వద్ద ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసు (ఐటీబీపీ)లు యోగాసనాలు వేశారు.అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తోథిపూర్‌లో ఉన్న యానిమల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ (ఏటీఎస్‌)లో గుర్రాలపై ఐటీబీపీ సైనికులు ఆసనాలు వేశారు. ఇక లఢక్‌లోని 18 వేల అడుగుల ఎత్తయిన ప‌ర్వత శ్రేణిపై ఐటీబీపీ సైనికులు యోగా కార్యక్రమం నిర్వహించారు. గల్వాన్‌లో, లఢక్‌లో 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద సైనికులు యోగా సాధన చేశారు. హ‌రిద్వార్‌లోని నిరమాయం యోగ్‌గ్రామ్‌లో యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

కాగా  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ యోగాసనాలు వేశారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు. దీనిద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చని తెలిపారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల శాంతి, సామరస్యం పెరుగుతాయని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఢిల్లీలోని తన నివాసంలో సతీమణి ఉషతో కలిసి యోగా సాధన వేశారు.అంర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనాలు వేశారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Proudly International Yoga Day
Yoga is the best way to mental health: Venkaiah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *