ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం ముచ్చట్లు :

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు  పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లోగల ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ఎన్టీఆర్ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి చరిత్రలోనే లేరన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు.

 

 

 

ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చంద్రబాబు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధే ఆయుధంగా అనుక్షణం పనిచేస్తున్నారని కొనియాడారు. ఓటుకు కోట్లు కేసు లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం ఆయన నిజాయితీకి నిదర్శనం అన్నారు. మచ్చలేని చంద్రుడు గా చంద్రబాబు ని పిలుస్తున్నారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్, ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, మల్లెంపాటి అప్పారావు, వాసిరెడ్డి భాస్కరరావు, నల్లమల రంజిత్, నున్నా నవీన్ చౌదరి, వక్కంతుల వంశీ ,ఆకారపు శ్రీనివాసరావు, నూక అనుమంతు రావు, కంపాటి విజయ్, రాజరాజేశ్వరి, ప్యారిస్ వెంకన్న, కృష్ణ ప్రసాద్ ,నాగండ్ల లక్ష్మణ్, యర్నం జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Proudly NTR birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *