బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండి

Provide a strong information technology system

Provide a strong information technology system

Date:20/11/2019

అమరావతి ముచ్చట్లు:

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండి: ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌. జగన్‌ గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యం.  ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలి.
రేషన్‌ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్‌ మెంట్‌కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయి. ఈ కార్డులు అక్కడే ప్రింట్‌ అయి లబ్ధిదారులకు అందాలంటే.. వ్యవస్థ అంతా సక్రమంగా, పటిష్టంగా ఉండాలి. విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరుకు సమీపంలో ఉన్న అనంతపురం ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుపై ఆలోచనలు చేయాలని సీఎం ఆదేశం. ప్రాథమికంగా ఒక్కో సిటీ 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటుపై ప్రణాళికలు తయారుచేయండి. గత ప్రభుత్వ ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌లు రూ.4వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. అలాంటిది చంద్రబాబు పరిశ్రమల గురించి, ఇండస్ట్రీస్‌ ప్రమోషన్స్‌ గురించి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడ్డం విడ్డూరం. పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరుచేయడంతోపాటు, పారదర్శక విధానాలను, అవినీతి రహిత సింగిల్‌ విండో పద్దతిని అందుబాటులోకి తీసుకు వచ్చాం. వచ్చే కంపెనీలకు ప్రోత్సాహక ధరలతో భూములు, నీరు, కరెంటు లాంటి సదుపాయాలను కల్పిస్తాం. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి హాజరైన ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఇతర అధికారులు.

 

కాశీ క్షేత్రములో కార్తీక మాస దీపాల శోభయమానం

 

Tags:Provide a strong information technology system

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *