కేంద్ర నిధుల ద్వారా  ప్రారంభించే పనులకు ముందస్తు సమాచారం అందించాలి 

Date:19/09/2020

– జిల్లా కలెక్టర్ ని కోరిన ఎంపీ అర్వింద్

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్న పనులకు హాజరయ్యేందుకు వీలుగా ముందస్తు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని  పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి  కోరారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుండి వీడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 3.36 కోట్లతో బాల్కొండ ఎన్ హెచ్ 44 నుండి పడగల్ చిట్టాపూర్- 6.59 కి. మీ., 1.19 కోట్లతో  బుస్సాపూర్ నుండి జలాల్పూర్ వయా నాగేపూర్, ఇత్వార్ పేట్ – 5.10 కి. మీ, 2.76 కోట్లతో సావెల్  పుష్కర ఘాట్ నుండి మెండోరా వయా సావెల్ -5.35 కోట్లు మొత్తం 7.32 కోట్లతో మూడు రోడ్లు మంజూరయ్యాయని, ఈ నిధులలో  60% నిధులు అనగా  4.39కోట్లు  కేంద్ర ప్రభుత్వం నుండే  విడుదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.తాను పార్లమెంట్   సమావేశాల్లో బిజీగా ఉన్న సమయం చూసి, ఎక్కడ  ప్రధాని మోడీ గార్కి పేరు వస్తుందో అని దొంగ చాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవేవో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందని సొంత డబ్బా కొట్టుకుంటూ ఈరోజు ఈ పనులను ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు.పార్లమెంట్ సభ్యుడినైన నాకు కనీసం 24 గంటల ముందు కూడా  తెలియజేయలేదని,తగిన  సమయం ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తున్న సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆయన తప్పు పట్టారు. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులని, అదేవిధంగా వ్యవహరించి సరైన ప్రోటోకాల్ పాటించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రారంభించేటప్పుడు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో  ప్రధాని మోడీ గారి బొమ్మను తప్పకుండా ఉంచాలని, అధికారులు  కార్యకర్తల్లాగా  వ్యవహరించకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.   మరోవైపు మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదేవిధముగా  పసుపు రైతులకు మద్దతుధర కోసం కేంద్రానికి  లేఖ రాయమంటే స్పందించని మంత్రి, కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులకు మాత్రం  ప్రారంభోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

 

మళ్లీ ఆగిన మల్లన్న సాగర్ పనులు

Tags:Provide advance notice of work to be initiated through central funding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *