సరియవలస గ్రామంలో తాగునీరు అందించండి

Date:29/10/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

డుంబ్రిగుడ మండలంలోని గుంటసీమ పంచాయితీ పరిధిలో ఉన్న సరియవలస గ్రామంలో మంజూరైన గ్రావిటీ పథకాన్ని పూర్తి చేసి గ్రామ గిరిజనులకు తాగునీరు అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.సురేంద్ర డిమాండ్ చేశారు.హాయ్ అన్న గ్రామానికి సందర్శించి సోలార్ గ్రావిటీ పథకాన్ని పరిశీలించారు.మంచినీటి ట్యాంకు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.గ్రామానికి నీరు అందక సమీపంలో ఉన్న ఊట నీరు తాగి అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా సోలార్ ట్యాంకు నిర్మాణంలో పనిచేసిన కూలీలకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ మోసగించాడని గ్రామస్తులు ఆయన దృష్టికి తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ పని చేయించి మోసగించడం ఏంటి అని కాంట్రాక్ట్ పై మండిపడ్డారు.అధికారులు స్పందించి కాంట్రాక్ట్ పై తగు చర్యలు తీసుకొని గ్రామానికి తాగునీరు అందే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో గొల్లూరి.తిలక్,గ్రామస్తులు పాల్గొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన నారాయణవనం సింగిల్ విండో ప్రెసిడెంట్!

Tags: Provide drinking water in Sariyavalasa village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *