మంచినీటి సౌకర్యం కల్పించండి  -సిపిఎం డిమాండ్

అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు:


అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దానిరంగిని గ్రామంలో మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆద్వర్యంలో మాడగడ పంచాయతీ సచివాలయం 2 చంపగుడ లో ధర్నా నిర్వహించారు. దానిరంగిని మహిళలు పెట్రుగుడ మహిళలు సుమారు 3 కిలోమీటర్లు మేర ఖాళీ బిందేలతో పాదయాత్ర చేసి సచివాలయం లో చేరుకొని మాకు మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ మాడగడ పంచాయతీ దానిరంగిని, పెట్రుగుడ గ్రామంలో  చుక్క నీరు లేక గొంతు ఎండుతున్న గిరిజనులకు మంచినీరు అందించకుండా గడప గడప మన ప్రభుత్వం పేరుతో వైసీపీ నాయకులు ఆదిమజాతి గిరిజనులకు మాయమాటలు చెప్పి తీవ్రంగా మోసం చేస్తున్నాది ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటే నిమ్మకునీరెత్తినట్లు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉన్నాయి .

 

 

అన్నా విషయం తెలిసినా గ్రామాలకు పర్యటన చేసి మంచినీటి సమస్య పరిష్కారం చేయకుండా కేవలం ఓట్ల కోసం గిరిజన ప్రాంతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం చేయడం సరైనది కాదు  సచివాలయం పరిధిలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు మా చేతిలో ఎటువంటి నిధులు లేక సమస్య పరిష్కారం చేయలేకపోతున్నామని సమాధానం ఇస్తున్నారు  అధికార పార్టీ  ప్రచార ఆర్భాటాలతో గ్రామాల్లో తిరుగుతున్నారు. కానీ కనీస సౌకర్యాలైన మంచినీరు, సిసి రోడ్డు విద్యుత్ దీపాలు కోత్తగా కట్టుకుంటున్నా వీధిలో కి కరెంట్ తదితర సమస్య పరిష్కారం చేయకపోవడం ఈప్రభుత్వం దుస్థితి; ప్రజా ప్రతినిధులు సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.గిరిజన ప్రాంతంలో తీవ్రంగా ఉన్నా మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంచినీటి సమస్య పరిష్కారం చేయని యెడల గడప గడప ప్రోగ్రాం కి ప్రతి  గ్రామానికి మహిళలు నిలదీస్తామని దానిరంగిని, పెట్రుగుడ మహిళలు హెచ్చరిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తాంగుల అర్జున్,సమర్డి సహదేవ్, గ్రామ మహిళలు ఎస్.ప్రమిల, ధన ,రాంమూర్తి, లక్ష్మి ,మొత్తి, రంభ మణి, డొమిని, శాంతి, రాములమ్మ రాధమ్మ , రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Provide fresh water facility -CPM demand

Post Midle
Natyam ad