గిరిజనులకు పిఎంఏవై పథకం ద్వారా ఇళ్లు ఇవ్వండి

-కేంద్రాన్ని కోరిన జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్

నంద్యాల ముచ్చట్లు:


రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) పథకం ద్వారా గిరిజనులకు ఇళ్లను పూర్తిగా నిర్మించి కేంద్ర ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక జిపిఎస్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది గిరిజనులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పక్కా ఇల్లు లేని గిరిజనులు చాలామంది ఉన్నారని వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్లను కట్టించి నిర్మించాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని గిరిజన ప్రాంతాల్లో రేకుల షెడ్లు, పెంకుటిల్లు గుడిసెల్లో ఉండి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అర్హులైన గిరిజన కుటుంబాలను గుర్తించి వారి సొంతింటి కలను సాకారం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఎస్టీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పేర్కొన్నారు. దేశంలోనే మెరుగైన విధానాలను అమలు చేసి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలునాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, విక్రం నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Provide houses to tribals through PMAY scheme

Leave A Reply

Your email address will not be published.