విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

Provide qualitative education to students

– కోఆర్డినేటర్‌ దామోదర్‌రెడ్డి

Date:16/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికి గుణాత్మక విద్యను అందించేందుకు మండల సీఆర్పీలు కృషి చేయాలని జిల్లా ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ దామోదర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎంఈవో కేశవరెడ్డి ఆధ్వర్యంలో సీఆర్పీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉర్ధూకస్తూరిభా విద్యార్థుల నమోదును పెంచాలన్నారు. అలాగే పాఠశాలల్లో కిచెన్‌గార్డెన్స్, విద్యార్థుల సామార్థ్యాలను పరిశీలించి గుణాత్మక విద్యను అందించాలన్నారు. పాఠశాలల్లో విందాం- నేర్చుకుందాం…రేడియో పాఠాలు వినిపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్పీలు ప్రతి రోజు పాఠశాలలు సందర్శించి, బడికి రాని పిల్లలను పాఠశాలలకు వచ్చే విధంగా ప్రోత్సహించాలన్నారు. పిల్లల ప్రగతిని ప్రదర్శించాలని , ప్రతి వారం నోబ్యాక్‌డే నిర్వహిస్తూ తల్లిదండ్రుల సమావేశాలు తప్పకుండ నిర్వహించాలని సూచించారు. అమ్మ ఒడి కార్యక్రమంలో వివరాలను పూర్తిగా సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. ఈ సమావేశంలో సీఆర్పీలు రఘు, శ్రీనివాసులు, తేజ, నారాయణస్వామి, లతీఫ్‌, మీనాక్షి, శిల్ప, మంజుల, అఖిల , సాయిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

19న ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీల లబ్ధిదారుల ఎంపిక

Tags: Provide qualitative education to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *