స్మార్ట్ ఫోన్లు,టీవీలు అందించి, ఉచిత నెట్, కేబుల్ సౌకర్యం కల్పించాలి

Date:02/09/2020

భువనగిరి  ముచ్చట్లు:

కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు చదువులు బోధిస్తున్న ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేని ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ” ప్రభుత్వం అందిస్తున్న ఆన్లైన్ విద్యా విధానం-విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన” ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విద్యావిధానం కరోనా నేపథ్యంలో స్వాగతిస్తున్నామని కానీ నేటికీ అనేక మంది పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, కొందరి ఇళ్ళల్లో టీవీలు లేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంకా చాలామందికి టీవీలు ఉన్న కేబుల్ సౌకర్యం (స్టార్ కనెక్షన్) పెట్టుకోవడానికి , ఫోన్లు ఉన్న నెట్టు ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఒక దిక్కు కరోనా, ఒక దిక్కు ఉపాధిలేక కుటుంబాలను పోషించలేక పేద ప్రజలు ఇబ్బందిపడుతున్న పరిస్థితి  ఉన్నదని ఇప్పటికైనా ప్రభుత్వం అందరికీ ఉచితంగా నెట్ సౌకర్యం, కేబుల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని నర్సింహ డిమాండ్ చేసినారు.ఆన్లైన్ విద్యతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా విద్యార్థులకు ఒక నెలకు సరిపడా సరుకులు ఇంటి దగ్గర విద్యార్థులకు ఇవ్వాలని నర్సింహ సూచించారు.

 

 

అందరికీ విద్య అందకపోతే  రానున్న కాలంలో పేద విద్యార్థులు అసమానతలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కరోనా నేపథ్యంలో అనేక మంది పేద విద్యార్థులు అర్ధాకలితో కాలం వెళ్లబుచ్చుతున్నారని ప్రభుత్వం ఎందుకు విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద సరుకులను పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధంగా మన రాష్ట్రంలో కూడా ఆన్లైన్ విద్యా అన్ని తరగతుల విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు ఆర్.లక్ష్మి, ఉపాధ్యాయులు బి.సత్యనారాయణ, పి.మురళి, వి.శ్రీదేవి, సంఘం నాయకులు కొండ అశోకు, కూకుట్ల కృష్ణ, పుల్లెల మల్లేష్, కాసారం మల్లయ్య, కొండ లక్ష్మయ్య తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: హోంశాఖ‌ ఆదేశం

Tags:Provide smart phones, TVs and free internet and cable facilities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *