క్యాన్సర్ సొకిన చిన్నారికి చికిత్స అందించండి

Provide treatment for children with cancer

Provide treatment for children with cancer

అధికారులకు సీఎం జగన్ ఆదేశం

Date:03/12/2019

అమరావతి ముచ్చట్లు:

కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ ఆనారోగ్యం మీద వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై సీఎం  వైయస్.జగన్ స్పందించారు.  తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమకు అనారోగ్యంపై సీఎం ఆరా తీసారు. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు ఇంతకముందే నిర్ణయం తీసుకున్నామని అయన అన్నారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండని అయన ఆదేశించారు.  చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స వుంటుందని అయన అన్నారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఈలోగా అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించండని  అధికారులకు సీఎం ఆదేశించారు. చిన్నారి హేమ కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

ఆన్ లైన్ లో మోసం

 

Tags:Provide treatment for children with cancer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *