కనీస వేతనాలోకోసం అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:

మధ్యాహ్న భోజన పథకంలో పనిచే స్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం విధులు కేటాయించడంలో కార్మికుల పట్ల అత్యంత నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తుందని కార్మికులు ఆవే దన వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీలకు నెలలు తరబడి బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోందని వాపోయారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి వండి పెడుతున్నా…రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు శ్రమిస్తున్నా గౌరవ వేతనం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు 2వేల రూపాయలు మాత్రమే జీతంగా చెల్లించడం సమంజసం కాదని ఆగ్రహం వెలిబుచ్చారు. సామాజిక భద్రత పెన్షన్లు తమకు అమలు చేయకపోవడం… అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నా ఎలాంటి వైద్య బీమా లేకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అన్ స్కిల్డ్ వర్కర్లకు ఇచ్చే వేతనం ఇవ్వాలని… గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని… ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని… పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని… పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 

Tags: Provision for minimum wage

Leave A Reply

Your email address will not be published.