కళ్యాణ మండపం నిర్మాణానికి రూ 50 లక్షల అందజేత

– చైర్మన్  వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందజేసిన నూతల పాడు వాసులు
 
తిరుమల ముచ్చట్లు:
 
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో కళ్యాణమండపం నిర్మాణానికి గాను గ్రామస్తుల వాటాగా రూ 50 లక్షల చెక్కును బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.
వై ఎస్ ఆర్ సిపి నాయకులు  బత్తులబ్రహ్మానందరెడ్డి, సింగిల్ విండో అధ్యక్ష్యులు  బాపిరెడ్డి,  లక్ష్మరెడ్డి, నరసింహారావు, వేణుగోపాల్ రెడ్డి,  రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ ను కలసి ఈ చెక్కును అందజేశారు. కళ్యాణ.మండపం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
 
Tags: Provision of Rs. 50 lakhs for the construction of Kalyana Mandapam

Natyam ad