Natyam ad

పీఆర్సీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన పి ఆర్ టి యు

నెల్లూరు ముచ్చట్లు:
రాష్ట్రప్రభుత్వ ,ఉద్యోగ ,పెన్షనర్లకు ప్రభుత్వం  23.5 ఫిట్మెంట్ పెంచుతూ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం నెల్లూరు జిల్లా శాఖ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పిఆర్సి ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన 23.9 శాతం కొంతవరకు ఆర్థిక భరోసా కల్పించినట్లయిందని వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ .ప్రభుత్వం తీసుకునే నిర్ణయం హర్షణీయమన్నారు. విశ్రాంత ఉద్యోగులకు 2018 ఇది జులై 1 నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు యూనియన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు డి .వెంకట రాజు, ప్రధాన కార్యదర్శి నాటకం. తిరుమలయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎస్ .నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: PRTU hails PRC statement

Leave A Reply

Your email address will not be published.