Natyam ad

తెలుగుదేశం అభ్యర్థి చల్లాబాబుకు మద్దతుగా సైకాలజిస్ట్ కృష్ణమూర్తి

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో సైకాలజిస్ట్గా పని చేస్తున్న దాసరి కృష్ణమూర్తి రెండు రోజుల క్రితం పుంగనూరు తెలుగుదేశం అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో సైకాలజిస్ట్గా ఉన్న దాసరి కృష్ణమూర్తి సోమల మండలం గున్నావారిపల్లెకి చెందిన వ్యక్తి. ఇలా ఉండగా తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి సోమల మండలంలో రెండు రోజుల క్రితం పర్యటించారు. ఆ సమయంలో సైకాలజిస్ట్ కృష్ణమూర్తి చల్లాబాబుతో సన్నిహితంగా ఉంటు ప్రచారంలో పాల్గొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు.

Post Midle

 

Tags: Psychologist Krishnamurthy supports Telugu Desam candidate Challa Babu

Post Midle