Natyam ad

బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు బహిరంగ వేలము

చౌడేపల్లి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి   బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు   16 వ తేదీన జరిగిన బహిరంగ వేలములో 1) దేవస్థానము & పంచాయితీకి చెందిన టోల్ గేటు నిర్వహించుకొను హక్కునకు రూ. 81,20,000/-లు +GST – రూ. 14,61,600/- కలిపి మొత్తము రూ. 95,81,600/-లు T. రఘుపతి నాయిడు, S/o క్రిష్ణ మూర్తి నాయుడు, భవానీ నగర్ వారు, 2) తలనీలాలు సేకరించుకొను హక్కునకు రూ. 41,00,000/-లు K. దేవ వెంకట నాగేంద్ర, గోడిగనూరు, చాగలమర్రి వారు, 3) ఫోటోలు తీసుకొను హక్కునకు రూ. 72,000/-లు N. మల్లిఖార్జున, యనాదిపాళ్యం వారు హెచ్చుపాటదారునిగా దక్కించుకొన్నారు. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, దిగువపల్లి పంచాయతీ సర్పంచ్  సోనీ , దిగువపల్లి పంచాయతీ సెక్రెటరీ  వసుంధర, ఎండోమెంటు తనిఖీదారు   శశికుమార్ , సప్తగిరి గ్రామీణ బ్యాంకు వారు, చౌడేపల్లి పోలీసు వారు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Public auction held at Boyakonda Gangamma Devasthanam

Post Midle