సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన

Date:01/08/2020

అమరావతి ముచ్చట్లు:

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఆగస్టు 1 నుంచి 31వరకూ ఆన్‌లైన్‌ లైవ్‌ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో నిపుణులు పాల్గొంటారు.నేరాల తీరుతెన్నులు, వాటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారని, బాలికల తల్లిదండ్రులు, విద్యార్థులు, మహిళలు, యువత.. ఇలా అన్నివర్గాలవారు ఈ లైవ్‌లో పాల్గొనవచ్చని ఏపీ సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 1న పోస్టర్‌ ఆవిష్కరణ 2న రేడియో ద్వారా సందేశం, 3న రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌  వెబినార్‌ ద్వారా ఈ-రక్షాబంధన్‌.. అవగాహన కార్యక్రమ ప్రారంభం ఉంటుందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులు

Tags: Public awareness on cyber crime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *