ప్రజారోగ్యమే ఎమ్మెల్యే, సర్పంచుల ధ్యేయం

రామసముద్రం ముచ్చట్లు:

 

 

 

ప్రజారోగ్యమే ధ్యేయంగా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డిల ధ్యేయమని స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డిలు అన్నారు. ఆదివారం స్థానిక పంచాయతీ కేంద్రమైన కెసిపల్లి గ్రామంలో కరోన పాజిటివ్ వచ్చిన వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోన మహమ్మారి సోకిన వారికి హోం ఐషోలేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు నవాజ్ బాషాల ఆదేశాల మేరకు పంచాయతీలో కరోనపై అవగాహన కల్పించారు. అలాగే కరోన భారిన పడిన వారికి పలు జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన భారిన పడిన వారు అధైర్య చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సకాలంలో స్పందించాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాలు అధికారులను ఆదేశించారన్నారు. అదే విధంగా సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి కూడా పంచాయతీలో నమోదు అవుతున్న కరోన కేసుల వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట తిరక్కుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఏఎన్ఎం సుగుణమ్మ, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, వాలింటర్లు రెడ్డెమ్మ, రేవతి, రామచంద్ర, ప్రదీప్, నాయకులు సీఆర్.వాసు, ఆర్. నారాయణరెడ్డి, సీఆర్. మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Public health is the goal of the MLA, the serpent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *