Natyam ad

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం- పౌష్టికాహారం పంపిణీలో సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి అంగన్ వాడి కేంద్రంలో వైఎస్సార్‌ కిట్స్, పౌష్టికాహారాన్ని గర్భవతులకు, బాలింతలకు ప్రతినెల అందజేసే పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్ వాడి కేంద్రాలకు ఎప్పుడూ పౌష్టికాహారం వస్తోందో అని ఎదురు చూసే వారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా ప్రతి నెలా ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించి పంపిణీ చేయాలని అదేశించారన్నారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి ఉపాధ్యాయురాలు రాధమ్మ, హెల్పర్ రెడ్డెమ్మ, స్థానిక నాయకులు బాబు, ఎల్లారెడ్డి, నాగరాజ, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Public health is the mission of the government- Sarpanch Srinivasulureddy in the distribution of nutritious food

Post Midle