Natyam ad

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

జగిత్యాల  ముచ్చట్లు:

ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా  కలెక్టరేట్ పాలనాధికారి రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ సమస్యలపై ప్రజల నుండి 45 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని పాలనాధికారి రాజేందర్ ఆదేశించారు.. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో ఆయన మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పాలనాధికారి రాజేందర్ తోపాటు వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Public issues must be resolved quickly

Leave A Reply

Your email address will not be published.