ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి.

– జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి ముచ్చట్లు:
 
ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ  సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం  ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు.  వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు  వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Public issues must be resolved quickly.

Leave A Reply

Your email address will not be published.