పుంగనూరులో సచివాలయల ద్వారా ప్రజలముంగిటకు సేవలు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలోని పేద ప్రజల సమస్యలను వారి ఇండ్ల వద్ద పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని భరిణేపల్లె, ఇందిరాకాలనీ, గడ్డూరు, ఎంసీ.పల్లె లో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్నతో కలసి ఎంపీపీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను పంపిణీ చేసిన వివరాలను ప్రజలకు వివరించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయాలు , వలంటీర్ల ద్వారా ప్రజల సమస్యలు ఇండ్ల వద్దనే గుర్తించి, అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ముఖ్యంగా అన్ని రంగాలలోను మహిళలకు 50 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించారని స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న జగనన్న మహిళా మార్ట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని , వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పిఏ చంద్రహాస్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు సుబ్రమణ్యయాదవ్‌, చంద్రారెడ్డి యాదవ్‌, వెంకటరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తో పాటు అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Post Midle

Tags: Public outreach services through secretariats in Punganur – MP Akkisani Bhaskarreddy

 

Post Midle
Natyam ad