ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

వరంగల్  ముచ్చట్లు:
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో ప్రారంభించి మాట్లాడారు. ఊరికి ఏం కావాలో మీరే నిర్ణయం తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. పట్టణాలకు వలసలను తగ్గించుకోవాలి. ప్రభుత్వ పథకాలను హక్కుగా తీసుకోవడంతో పాటు పంచాయతీకి కట్టాల్సిన పన్నులను బాధ్యతతో చెల్లించాలని పేర్కొననారు.గ్రామ పంచాయతీలు ఆదాయం పెంచుకుని వాటికి ప్రభుత్వ నిధులు కలుపుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజూ మనిషి తనను తాను శుభ్రం చేసుకున్నట్లే పల్లెను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే పల్లెప్రగతి కార్యక్రమంచేపట్టిందన్నారు. తెలంగాణ మొత్తం పచ్చదనం పరుచుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు మనం స్వచ్చమైన వాతావరణం అందించాలని మంత్రి పేర్కొన్నారు. కడుకుంట్లకు అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Public participation is mandatory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *