ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు నిషేధం : రజిత్ కుమార్

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేంటో ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలి. 24 గంటల్లో రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలి. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి, గోడపత్రికలు అతికించాలి. అనుమతి లేకుంటే 72 గంటల్లో వాటిని తొలగించాలి. ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదు. ప్రతి జిల్లాలో, సీఈఓ కార్యాలయంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. డిసెంబర్ 7న 119 స్థానాలకు ఒకే సారి పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలన్నారు. ఫిర్యాదులన్నింటిని ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. కొనసాగుతున్న పనుల వివరాలు 72 గంటల్లో కలెక్టర్లు ఎన్నికల సంఘానికి తెలపాలని, కొత్త పనులు ప్రారంభించరాదని ఆదేశించారు.
Tags: Public prohibition in public places: Rajith Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *