18 నుంచి 20 వరకు విద్యుత్ టారిఫ్ పై ప్రజాభిప్రాయసేకరణ- ఎస్ ఈ ఆదిశేషయ్య

Date:16/01/2021

నెల్లూరు ముచ్చట్లు:

విద్యుత్ శాఖ అమలుచేస్తున్న టారీఫ్ పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 18 నుండి 20 వరకు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె .ఆదిశేషయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 ఆర్ధిక సంవత్సరం కు గాను డిస్కమ్ లు ప్రతిపాదించిన  ఆదాయవనరులపైన,టారిఫ్ ల పైన రాష్ట్ర ఎలెక్ట్రసిటీ రెగ్యులరిటీ కమీషన్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ సూపరెంటెండింగ్ ఇంజనీర్ కె. ఆదిశేషయ్య  తెలిపారు .ఈ నెల 18 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు ఏ పీ ఇ ఆ ర్ సి చైర్మన్ విసి నాగార్జునరెడ్డి  వీడియో కాన్ఫరెన్స్ ద్వార ప్రజాభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారన్నారు. ఈ మూడురోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ భవన్ నందు అన్ని డివిజన్(నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, కావలి) కార్యాలయాలలో నిర్వహించెదరు.కావున వినియోగదారులు, రైతులు వారి అభిప్రాయాలను,అభ్యoతరాలను, సూచలనలను , సలహాలను మీ దగ్గరిలోని కార్యాలయాలలో స్వచ్చందంగా  తెలియచేయాలని అన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Public Referendum on Electricity Tariff from 18 to 20- S E Adiseshayya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *