పచ్చదనం పెంపుదలకు ప్రజా ప్రతినిధులు,  అధికారులు కృషి చేయాలి 

Date:08/09/2020

కామారెడ్డి ముచ్చట్లు:

పచ్చదనం పెంపునకు ప్రజా ప్రతినిధులు, అధికారులు  కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. మంగళవారం ఆయన బిక్కనూరు, జంగంపల్లి, అంతంపల్లి, బస్వాపూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లె ప్రకృతి వనం లో ఐదు వేల మొక్కలు ఉండే విధంగా చూడాలని కోరారు. మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం వల్ల ప్రకృతి వనం చిట్టడవిలా మారుతోందని సూచించారు. నాటిన మొక్కల కు పాదులు ఏర్పాటు చేయాలన్నారు. బిందుసేద్యం ద్వారా నీటిని అందించాలని, సూచించారు ప్రకృతి వనం లో బెంచీలు, నడకదారి ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. ప్రకృతి వనం లో ఉన్న మొక్కలను ఎవరైనా ధ్వంసం చేస్తే వారికి జరిమానాలు విధించాలని హెచ్చరించారు. జంగంపల్లి, బిక్కనూర్, బస్వాపూర్ లోని రైతు వేదిక భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఈనెల 10లోగా భవనాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ , అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్, మండల ప్రత్యేక అధికారి ని విజయలక్ష్మి, ఎంపీడీవో అనంతరావు, తాసిల్దార్ గోవర్ధన్, ఎం పీ ఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ రాజ్ డి.ఈ.మురళి, అధికారులు పాల్గొన్నారు.

 

  రాష్ట్రంలో జనరంజక పాలన

Tags:Public representatives and officials should work for the promotion of greenery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *