ప్రజా ప్రతినిధులు చెప్పలేనివి సాధికార మిత్రలు చెపుతున్నారు 

Public representatives say unappreciated power associates
-అదే చంద్రన్న సాధించిన ప్రగతి
-మంత్రి దేవినేని
Date:03/03/2018
విజయవాడ ముచ్చట్లు:
 ప్రజలకు పని చేయాలంటే నిర్మొహమాటంగా మాట్లాడాలని ఆ పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని అదే విధంగా అందరూ పని చేయాలని ఒక మంచి అవకాశం ముఖ్యమంత్రి సాధికార మిత్రలను ఇచ్చారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో విజయవాడ రూరల్ మండల పరిధిలోని సాధికార మిత్రలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ 68 ఏళ్ల వయస్సు లో ముఖ్యమంత్రి  కష్టపడుతున్నారని  మనమందరం ఏ విధముగా పని చేస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. అధికారం, పెత్తనాలు చేసేందుకు సాధికార మిత్రలను పెట్టలేదని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి తేలియజెప్పి, వారి సమస్యల తీర్చే దిశగా పనిచేయాలని సూచించారు. సాధికార మిత్రలను అప్పగించిన ప్రతి 35 కుటుంబాలను సర్వే చేసారా లేదా అని ప్రతి గ్రామం నుండి వచ్చిన సాధికార మిత్రను స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామం నుండి 5 మంది సాధికార మిత్రలతో వారు సర్వే చేసిన కుటుంబాలలో గుర్తించిన సమస్యలపై మాట్లాడించారు. గ్రామాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. దీనికి మంత్రి ఉమా ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో సుమారు 4వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఇంకా 6వేల పట్టాలు మొత్తం 10 వేలు లక్ష్యంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ఈ నెల 10న జి.కొండూరులో మెగా ఉద్యోగమేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో మార్చి 10వ తేదిన మెగా ఉద్యోగ మేళా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
Tags: Public representatives say unappreciated power associates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *