-జిల్లా కలెక్టర్ జి. రవి
Date:02/12/2020
జగిత్యాల ముచ్చట్లు:
కరోనా ప్రబావంతో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను శభ్రపరచడంలో అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు, వార్డుమెంబర్లు, సర్పంచులు, పాఠశాలల్లో చదివే పిల్లల తల్లితండ్రులతో పాటు ఓల్డ్ స్టూడెంట్స్ ను బాగస్వాములను చేసి శ్రమదానం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా చూడాలని అన్నారు. బుదవారం సారంగపూర్, కొనాపూర్, బిర్పూర్ లలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా ప్రబావంతో గత కోన్ని నెలలుగా మూసివేసిన పాఠశాలల పరిసర ప్రాంతాలను, తరగతి గదులను మరియు గదిపైబాగాలలో చెత్తలేకుండా పరిశుభ్రంగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ముందుగా తరగతి గదులలో పేరుకుపోయిన పాదులను తొలగించాలని, అందులోని బేంచిలు, ప్లోరింగ్ ను శుభ్రపరచి బ్లిచింగ్ పౌడర్ చల్లించాలి సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణ మరియు పరిసరాలను శుభ్రంచేయించాలి తెలిపారు. పాఠశాల పరిశభ్రతను డ్రైవ్ మోడ్ గా నిర్వహించాలని అవసరాన్ని బట్టి కూలీలను ఏర్పాటు చేయించాలని, అవసరమైన తరగతి గదులలో పునరుద్దరణ పనులను చేపట్టాలని, అధికారులు మండలంలోని ప్రతిపాఠశాలను సందర్శించి పరిశుభ్రత పనులలో పాల్గోనేల ప్రోత్సహించాలని, పాఠశాలలను పరిశభ్రంచేయించడంలో ప్రదానోపాద్యాయులు, టీచర్లుకూడా పాల్గోని పరిశభ్రత పనులను స్వయంగా పర్యవేక్షించి, తిరిగి పిల్లలు బడికి వచ్చేసమయానికి అందంగా తీర్చిదిద్దాలని అన్నారు.
అనంతరం అన్ లైన్ తరగతుల నిర్వహణను గురించి అడిగితెలుసుకుని పలుసూచనలు జారిచేశారు. ఆన్ లైన్ తరగతులకు హజరయ్యే టీచర్ల వివరాలను మువ్ మెంట్ రిజిస్టర్ లను తనిఖీచేసి, వివరాలను నమోదు చేయడంతొ పాటు, వారు ఎక్కడ ఆన్ లైన్ తరగతులకు హజరయ్యారొ వాటి పూర్తివివరాలను రిజిస్టర్ లలో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమం చివరగా సారంగపూర్ మండలంలొని పల్లెప్రకృతి వనాన్ని సందర్సించారు. పూలమొక్కలు కాకుండా ఎపుగాపెరిగే దాదాపు 5వేల మొక్కలు నాటేలా చూడాలని, మొక్కలమద్య దూరాన్ని తగ్గస్తూ మరికొన్ని మొక్కలను నాటాలని సూచించారు. వనంబయట గ్రిన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్నచోట మరికొన్ని మొక్కలను నాటేలా చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ప్రత్యేక అధికారి శేఖర్, బీర్పూర్ తహసీల్దార్ నాగర్జున, సారంగపూర్, బీర్పూర్ యంపిడిఓలు పుల్లయ్య, పుల్లారెడ్డి, విద్యాశాఖ అధికారులు, సర్పంచ్ లు, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
Tags:Public schools should be cleaned up through hard work