కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలనే డిమాండ్ తో ప్రజా పోరు యాత్ర
విశాఖపట్నం ముచ్చట్లు:
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా పోరు యాత్ర ను జెర్రీపోతుల పరుశురాం ప్రారంభిం చారు. విశాఖ నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి ప్రారంభమైన ప్రజా పోరు యాత్రలో బహుజన్ ద్రవిడ పార్టీ వ్యవ స్థాపకుడు జీవన్ కుమార్ మల్ల తది తరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెర్రిపో తుల పరశురాం మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ముఖ్య కారకుడైన అంబేద్కర్ ఫోటో ను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రప టాన్ని పెట్టాలని, నూతన పార్లమెంటు కు భారతరత్న అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.
Tags: Public struggle campaign with demand to put Ambedkar’s photo on currency notes

