ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి-జిల్లా   కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్ధిపేట ముచ్చట్లు:

 

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జీవన్ పాటిల్…. అధికారులకు సూచించారు.
సోమవారం ఐడీఓసీ మీటింగ్ హల్ లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి స్వీకరించారు. ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి నుండి అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటి పరిష్కారాలను శుక్రవారం లోపు తెలియజేయాలన్నారు. ప్రజలు నుండి మళ్లీ మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 44 అర్జీలు వచ్చాయి. అలాగే అధికారులు అందరూ విధిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పక హాజరుకావాలని జిల్లా  కలెక్టర్ స్పష్టం చేశారు.   ఇట్టి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Public voice complaints should be addressed immediately-District   Collector Prashanth Jeevan Patil

Leave A Reply

Your email address will not be published.