ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం…

చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు

నరసాపురం ముచ్చట్లు:

సంక్షేమ పరిపాలనను ప్రజలకు చేరువ చేశామని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు.నరసాపురం పట్టణం 20 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ,వారికి అందే సంక్షేమ కార్యక్రమాలను బ్రౌచర్ ఇచ్చి వివరిస్తూ ప్రజలతో మమేకమై విస్తృత పర్యటన చేశారు.తొలుత ముదునూరి కి వార్డులో నాయకులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయం వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రతి కుటుంబానికి తీసుకువెళ్ళి సంక్షేమ పథకాలు ప్రజల గడపకు చేరుస్తున్నామని అన్నారు. ఈ మూడు సంవత్సారాలలో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల బ్రోచర్స్ ను ప్రజలకు ఆయన అందజేశారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతున్నామని ప్రజలు ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తిని కనబరుస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, విద్యుత్, నాడు నేడు పాటశాలలు తదితర అంశాలపైన పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరిగితే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలందరికీ సక్రమంగా అందుతాయని ఆయన అన్నారు. అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, గృహ నిర్మాణాల లబ్ధిదారులతో మాట్లాడి వేగంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా తమవంతు కృషి చూపించాలని ఆయన అన్నారు.

 

 

Post Midle

అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి రహదారుల నిర్మాణం, త్రాగు నీరు, డ్రైనేజ్, విద్యుత్, అంగన్వాడి భవనాల నాడు నేడు పాటశాల అభివృద్ధి స్మశాన వాటిక తదితర సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన చీఫ్ విప్ అధికారుల సమీక్షలో వాటి పరిష్కారం కోసం పలు సూచనలు సలహాలు ఆయన చేశారు. ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. సచివాలయ వాలంటీర్ల పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవు అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బర్రి శ్రీ వెంకట రమణ జయరాజు,కౌన్సిలర్లు,20వ వార్డు నాయకులు,యూత్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Public welfare is the government’s motto …

Post Midle
Natyam ad