అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా  ఇల్లు జగనన్న కాలనీలు ప్రారంభోత్సవంలో  ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి    

మంత్రాలయం ముచ్చట్లు:
అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని  మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోణ గ్రామంలో నవరత్నాల్లో భాగంగా నిరుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. జగనన్న ప్రభుత్వంలో పేద వాళ్ళందరికీ ఇళ్ళ  పట్టాలు మంజూరు చేశామని, అలాగే పట్టాలు మంజూరు చేసిన వారితో పాటు ఇంటి స్తలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదవారికి పక్కా  ఇల్లు మంజూరు చేస్తామని హ్యట్రిక్ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు. ఈయనతో పాటు వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేద స్వరూపణి, సీఐ కృష్ణయ్య, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, హౌసింగ్ అధికారులు ఉన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Pucca home for everyone who qualifies
MLA Balanagireddy at the inauguration of Jagannath Colonies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *