ఘనంగా పుచ్చలపల్లి జయంతి
-ప్రజా వాగ్గేయ కారుడు రాజారాం ప్రకాష్
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా కేంద్రంలోని కమ్యూనిస్టు గాంధీ ప్రజల మనిషి పుచ్చలపల్లి సుందరయ్య గారి 110 జయంతి ని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ప్రజా వాగ్గేయ కారుడు
రాజా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు నాయకుడు,తెలంగాణారైతాగ
సాయుధ పోరాటాలవీరుడు,స్వాతంత్ర సమర యోధుడు.కమ్యూనిస్టుగాంధీగానుపే
అనుకొనికుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స పాటించాడు.తండ్రి గారినుండిలభించిన ఆస్తిని నిరుపేదప్రజలకు పంచేసాడు.1985 సం.మే19న మద్రాసులోని అపోలోఆస్పత్రిలో పుచ్చలపల్లిసుందరయ్యమరణించారు.హైదరాబాద్ భాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో
గ్రంథాలయం, ఆడిటోరియం, పార్క్ ఏర్పాటు చేశారు. గాంధీజీ గారి నిరాడంబరత ప్రకాశం పంతులు వంటి ప్రజా సాహిత్యం పటేల్ వంటి పట్టుదల నెహ్రూ అంటే రాజకీయ పరిణితి ఉన్నాయని నేటికి ఆలోచన విధానం పదికాలాలపాటు వర్ధిల్లుతుందని కమ్యూనిజం అజేయం మానవత్వం గొప్పదనిఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడురాజారాం ప్రకాష్ అన్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కృష్ణయ్య నాయకుడు ఎర్రం భాస్కర్,కోనేటి వెంకటేశ్వర్లు వై.ఎస్.ఆర్. టి. పి. రాష్ట్ర నాయకుడు,కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు,నిదర్శన్ గౌడ్ గౌడ సంఘం జిల్లా నాయకుడు,వెంకటయ్య ఎరుకల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకుడు మురళీధర చారి
కార్మిక సంఘం నాయకుడు చెన్నయ్య,నాగరాజు . విద్యార్థులు మురళి, మహేష్,మొదలగు వారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:Puchchalapalli Jayanthi
