Natyam ad

శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి

శ్రీశైలం ముచ్చట్లు:


పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి శ్రీశైలక్షేత్రానికి విచ్చేసి శ్రీస్వామి అమ్మవార్లను సేవించుకున్నారు. ఈ సందర్భంగా వీరు శ్రీస్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను, ఫలపుష్పాలను సమర్పించారు. అయన వెంట ఆ రాష్ట్ర శాసనసభ్యులు ఎ.కె.డి. అర్ముగం, కె.ఎస్.పి. రమేష్,దక్షిణామూర్తి, లక్ష్మీకాంత్ కూడా ఉన్నారు.భ్రమరాంబా అతిథిగృహం వద్దకు చేరుకున్న రంగస్వామికి  నంద్యాల జిల్లా ఎ.ఎస్.పి ఆర్. రమణ, అత్మకూరు ఇంఛార్జి డి.ఎస్.పి మహేశ్వరరెడ్డి, మండల డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ కుమార్, దేవస్థానం వసతి విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎస్. వి. మోహన్ తదితరులు స్వాగతం పలికారు.
ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి, శాసనసభ్యులకు ఆలయ రాజగోపురంవద్ద అర్చకస్వాములు, వేదపండితులు, దేవస్థాన పర్యవేక్షకులు మధుసూదన్ రెడ్డి తదితర అధికారులు ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. తరువాత వారంతా శ్రీ రత్నగర్భగణపతిస్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత శ్రీ మల్లికార్జునస్వామివారికి అభిషేకాన్ని జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వారికి  వేదాశీర్వచనముతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేసారు.

 

Tags: Puducherry Chief Minister visited Srisailakshetra

Post Midle
Post Midle