లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గ్యారెంటీ పథకాలకు పూజలు.
కమాన్ పూర్ ముచ్చట్లు:
మంథని నియోజక వర్గం ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని సుందిళ్ల గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరు గ్యారెంటీ పథకాల పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కాగా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మంథనిలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఉన్నత మంత్రి పొందాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉట్ల గోపాల్ రెడ్డి సుందిళ్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం సదానందం, మాజీ సర్పంచ్ మార్క స్వామి గౌడ్, నాయకులు ముసుకుల నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Pujas for guarantee schemes at Lakshmi Narasimha Swamy Temple.
