లోకేష్ పాదయాత్రకోసం పూజలు
నర్సాపురం ముచ్చట్లు:
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టిడిపి నాయకులు పొత్తూరు రామరాజు ఆధ్వర్యంలోపట్టణంలోని లాగ వద్ద వేంచేసి ఉన్న వీరభవాన్ని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి గరగాలతో ఊరేగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినతర్వాత ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ పరిపాలన ప్రారంభమైందని చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక క్రిమినల్ కేస్ కూడా లేదని చంద్రబాబు నాయుడు ఎంతో మంచి పరిపాలన చేశారని జగన్ ప్రభుత్వాన్ని పారద్రోలాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.ఈ రోజున నారా లోకేష్ పాదయాత్ర కు అమ్మవారి ఆశీస్సులతో యువగళం సక్సెస్ అవ్వాలని పూజలు చేసామని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు పద్మ. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శశిదేవి. టిడిపి కౌన్సిలర్ పాలూరి బాబ్జి. కొల్లు పెద్దిరాజు. ఠాగూర్ .జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags:Pujas for Lokesh Padayatra

