ఎలుగుబంటి కార్తీకమాసం పూజలు
శ్రీసత్యసాయి ముచ్చట్లు:
భక్తులు దేవాలయంలోకి రాగానే గంట ఎలా మోగిస్తారో అలాగే 108 కిలోలున్న గంటను ఒక ఎలుగుబంటి మోగించిన విచిత్ర సంఘటన అమ్మాజి దేవాలయంలో చోటు చేసుకొంది. శ్రీ సత్యసాయిజిల్లా మడకశిర నియోజక వర్గంలోని రొళ్ళ మండలంలోని అమ్మాజి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్బంగా ఆలయంలో విశేష పూజలు చేసారు. రాత్రి దేవాలయం తలుపులు మూసివేసి అర్చకులు వెళ్లిపోయారు. తరువాత కొంతసేపటికి రెండు ఎలుగు బంట్లు అలయ ప్రాంగణంలోకి వచ్చాయి.ఇందులో ఒక ఎలుగుబంటి ఆలయంలోకి రాగానే భక్తాదులు ఏవిధంగ గంట మోగిస్తారో అలాగే గంట మోగించి ఆలయమంతా తిరిగింది. ఈవిచిత్ర సంఘటన ఆలయం సిసి కెమెరాలో రికార్డయింది. అమ్మాజి దేవాలయంలోకి ప్రతిరోజు ఎలుగుబంట్లు రాత్రివేలల్లో వస్తుంటాయని కాని 108 కిలోలున్న గంటను ఎలుగుబంటి మోగించడం విచిత్రమైన సంఘటన అని గ్రామ ప్రజలు అంటున్నారు.
Tags: Pujas in the month of Elugubanti Kartikam

