Natyam ad

పుంగనూరులో దుర్గాష్టమి సందర్భంగా పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలలో వైభవంగా సోమవారం దుర్గాష్టమి కావడంతో ఎనిమిదవ రోజు అమ్మవార్లను సరస్వతిదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోనిశ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని వజ్రాలతో పొదిగిన చీరకట్టి అలంకరించారు. అలాగే శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని వివిధ రకాల పూలతో అలంకరించారు. శ్రీచాముండేశ్వరిదేవిని, శ్రీవిరూపాక్షి మారెమ్మను, చదళ్లలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవార్లను సరస్వతిదేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Pujas on the occasion of Durgashtami in Punganur

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.